calender_icon.png 30 August, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యశ్రీ సేవలు 1 నుంచి బంద్

30-08-2025 01:35:55 AM

రూ.1,400 కోట్ల బకాయిలు పెండింగ్  

  1. బిల్లులు చెల్లించకపోతే సేవలు అందించలేం
  2. ప్రభుత్వానికి ప్రైవేట్ హాస్పిటల్స్ నోటీస్

హైదరాబాద్ ఆగస్టు 29 (విజయక్రాంతి): పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచే ఆరోగ్యశ్రీ సేవలు సెప్టెంబర్ 1 నుంచి నిలిచిపోనున్నాయి. తమ బకాయిలు చెల్లించేందుకు  ఈ నెలాఖరు వరకు గడువు విధిస్తూ ప్రభుత్వానికి తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(టీఏఎన్‌హెఏ) నోటీసు అందించి ంది. నోటీసు అందించి వారం రోజులు గడుస్తున్నా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. దీంతో రాష్ర్టవ్యాప్తంగా ఉన్న 372 ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఆగిపోతాయేమోనని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. 

ఏడాదికాలంగా పైసా చెల్లించలేదు

రాష్ర్టంలో ఉన్న ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు ప్రభుత్వం ఏడాదికాలంగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని టీఏఎన్‌హెఏ తెలిపిం ది. సాధారణంగా ఆరోగ్యశ్రీ సేవలు పొందిన తర్వాత 40 రోజుల్లోపు బిల్లులు చెల్లించాలి. అయితే 400 రోజులు దాటినా ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించే పరిస్థితి కనపడటంలేదని ప్రైవేట్ హాస్పిటల్స్ వాపోతున్నాయి. జనవరిలో బకాయిల చెల్లింపు గురించి ప్రభుత్వం హామీ ఇచ్చినా.. అది మాత్రం అమల్లోకి రాలే దు. దీని వల్ల ఆస్పత్రులపై ఆర్థిక భారం పడుతుందని.. అందుకే సమస్య పరిష్కారం కోసం ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివే యబోతున్నట్లు ప్రకటించారు. 

జర్నలిస్టులు, ఉద్యోగుల హెల్త్ స్కీమ్స్ కూడా

ఆరోగ్యశ్రీ  పథకం ద్వారా పేదలు, మధ్య తరగతి ప్రజలకు ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఇక కాంగ్రెస్ సర్కార్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. బకాయిల పెండింగ్ అంశం గురించి గతంలోనే అసోసియేషన్ ఆపేస్తామని చెప్పినా.. ప్రభుత్వం వాటిని సీరియస్‌గా పట్టించుకోలేదు.

దీంతో సెప్టెంబర్ 1 నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీతో పాటు జర్నలిస్టులు, ఉద్యోగుల హెల్త్ స్కీ మ్స్‌కు కూడా ఈ నిలిపివేత వర్తించనుంది. ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని టీఏఎన్‌హెఏ తెలిపింది. ఆస్పత్రులపై ఆర్థిక భారం పెరగడం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణమని అంటున్నారు.

హామీ ఇచ్చిన అమలు చేయలేదు

ఈ ఏడాది జనవరిలోనే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని టీఏఎన్‌హెఏ హెచ్చరించింది. చర్చల అనంతరం దీన్ని కొనసాగి ంచేందుకు ఆసుపత్రులు ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తులు చేశాయి. ఆ సమయంలో రూ.1 ,400 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఇప్ప టివరకు ఆ హామీని నెరవేర్చలేదు. అందుకే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు టీఏఎన్‌హెఏ తెలిపింది. ఈమేరకు ఆరోగ్యశ్రీ సీఈవోకు టీఏఎన్‌హెఏ ఇప్పటికే లేఖ రాసింది.

చిన్న ఆసుపత్రులు మూతపడే దశలో ఉన్నాయి: వడ్డిరాజు రాకేశ్, టీఏఎన్‌హెఏ అధ్యక్షుడు

ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు సుమారు రూ.1,400 కోట్లకు పైగా చెల్లించకపోవడంతో.. చిన్న ఆసుపత్రులు మూతపడే పరిస్థితికి వచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం త్వరలో బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ప్యాకేజీ లను కూడా సవరిస్తామని తెలిపింది. కానీ నెలలు గడిచినా వీటిని అమలు చేయలేదు. కార్పొరేట్ ఆసుపత్రుల బిల్లులు కొన్ని రోజు లు ఆపినా... జిల్లాలకు చెందిన చిన్న హాస్పిటల్స్ బిల్లులైన ముందు చెల్లించాలి. లేదంటే సెప్టెంబరు ఒకటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయాలని నిర్ణయించాం.