calender_icon.png 30 August, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషనల్ ఫెన్సింగ్ పోటీలకు విద్యార్థులు

30-08-2025 02:21:55 AM

- అండర్-- పోటీల్లో బీసీ గురుకుల విద్యార్థులకు పతకాలు

- మంత్రి పొన్నం అభినందన

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): నేషనల్ ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాచుపల్లిలోని మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ -- పోటీల్లో బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు పతకాలు సాధించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

ఈ పోటీల్లో బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు 11 మంది హాజరయ్యారు. కాగా సురేఖ వెండి పతకం, మరొక విద్యార్థిని కాంస్య పతకం సాధించింది.  ప్రభుత్వ ఆలోచనను బీసీ గురుకుల విద్యార్థులు అనుసరిస్తూ క్రీడా పోటీల్లో పతకాలు సాధించడం అభినందనీయమని బీసీ సంక్షే మ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.