calender_icon.png 30 August, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్న భోజన బిల్లు గ్రీన్ చానల్‌లో..

30-08-2025 01:26:38 AM

  1. విద్యార్థులు, సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి
  2. ప్రతి విద్యా సంస్థలో క్రీడలకు ప్రాధాన్యం
  3. ఈడబ్ల్యూఐడీసీతోనే అన్ని విద్యాసంస్థల నిర్మాణాలు
  4. విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫె షనల్ కోర్సులు అందించే కళాశాలల్లో విద్యార్థులు, బోధన సిబ్బందికి ఫేషియ ల్ రికగ్నేషన్ తప్పనిసరి చేయాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశిం చారు. ముఖగుర్తింపుతో హాజరు శాతం మెరుగవడంతో పాటు ప్రొఫెషనల్ విద్యా సంస్థల్లో లోటుపాట్లను అరికట్టవచ్చన్నారు.

పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ప్రతి విద్యాసంస్థలోనూ మెరుగైన  బోధన సాగాలని.. విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలు మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపులను గ్రీన్ చానల్‌లో చేపట్టాలని, ఈ విషయంలో ఎటువంటి అల సత్వం చూపొద్దని సీఎం ఆదేశించారు.

విద్యాశాఖపై ఐసీసీసీ (ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్)లో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విద్యా శాఖ పరిధిలో అదనపు గదులు, వంట గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహారీల నిర్మాణం వివిధ విభాగాలు చేపట్టడం సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ నిర్మాణాల నాణ్యతా ప్రమాణాలు, నిర్మాణ పర్యవేక్షణ, నిధుల మంజూరు, జవాబుదారీతనానికి గానూ ఒకే విభాగం కింద ఉండాలన్నారు. 

కంటైనర్ కిచెన్ల ఏర్పాటు..

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న విద్యా, సంక్షేమ మౌలికవసతుల అభివృద్ధి సంస్థ (ఈడబ్ల్యూఐడీసీ) కిందనే రాష్ర్టంలోని అన్ని విద్యాసంస్థల నిర్మాణాలు కొనసాగాలని సీఎం ఆదేశించారు. ఈ సంస్థకు అవసరమైన ఇంజినీరింగ్, ఇతర సిబ్బందిని ఇతర విభాగాల నుంచి వెంటనే డిప్యూటేషన్‌పై తీసుకోవాలని సూచించారు. తెలంగా ణలోని మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. కంటైనర్ కిచెన్లకు ప్రాధాన్యమివ్వాలని.. కంటైనర్లపైన సోలార్ ప్యానెళ్లతో అవసరమైన విద్యుత్ వినియోగించుకోవచ్చని సీఎం తెలిపారు. 

కాంట్రాక్ట్ పద్ధతిలో పీఈటీ వ్యవస్థ..

ప్రతి పాఠశాలలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిన వ్యాయామ ఉపాధ్యాయులను నియమించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులకు సంబంధించిన బిల్లులు తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని బాలికలకు వివిధ అంశాలపై కౌన్సె లింగ్ ఇచ్చేందుకు మహిళా కౌన్సెలర్లను నియమించాలని సీఎం సూచించారు.

విద్యారంగంపై పెడుతున్న ఖర్చును తాము ఖర్చు గా కాక పెట్టుబడిగా చూస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. యంగ్ ఇండియా ఇంటెగ్రే టెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్లతో పాటు విద్యారంగం అభివృద్ధికి తీసుకునే రుణాలను ఎఫ్ ఆర్‌బీఎం పరిమితిలో లేకుండా చూడాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారని సీఎం తెలిపారు. 

పదేళ్ల నివేదిక తీయండి..

ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న వారిలో 90 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారని, ఈ విషయాన్ని నిర్ధారించేం దుకు గత పదేళ్లలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన వారి వివరాలపై నివేదిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో ముఖ్యమం త్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఓఎస్డీ వేములు శ్రీనివాసులు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, సాం కేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యాశాఖ సంచాల కుడు నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు.