calender_icon.png 30 August, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2,20,443 ఎకరాల్లో పంట నష్టం

30-08-2025 02:19:32 AM

1,09,626 ఎకరాల్లో వరి, 60,080 ఎకరాల్లో పత్తి పంట నష్టం

  1. వర్షాలు, వరదల వల్ల 28 జిల్లాల్లో పంటలపై తీవ్ర ప్రభావం
  2.   270 మండలాలు, 2,463 గ్రామాల్లో పంటలు ధ్వంసం
  3. దెబ్బతిన్న వరి, పత్తి, మొక్కజొన్న, టమాట, కంది పంటలు
  4. పంట నష్టంపై వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): రాష్ట్రం లో భారీ వర్షాల కారణంగా 2,20,443 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు, పొటెత్తిన వరదలకు రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో పంట నష్టం కల్గినట్లు రాష్ట్రవ్యవసాయ శాఖ వెల్లడించింది. వర్షాలతో 270 మండలాలు, 2,463 గ్రామాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

వరి, పత్తి, మొక్కజొ న్న, టమాట, కంది పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచ నా వేశారు. ఈమేరకు జిల్లాల వారీగా పంటం నష్టం పై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. నివేదిక ప్రకరారం 1,09,626 ఎకరాల్లో వరి, 60,080 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లగా, 16,036 ఎకరాల్లో మొక్కజొన్న, 6,751 ఎకరాల్లో కంది పంట దెబ్బతిన్నది. ఇక 116 ఎకరాల్లో వేరుశనగ, 6,751 ఎకరాల్లో సోయాబీన్, 639 ఎకరాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 

 కామారెడ్డి జిల్లాలో 77,394 ఎకరాల్లో

అత్యధికంగా కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పంటల నష్టం ఎక్కువగా నమోదైంది. కామారెడ్డి జిల్లాలోనే 77,394  ఎకరాల పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. మెదక్ జిల్లాలో 23,169 ఎకరాలు, ఆదిలాబాద్‌లో 21,276 ఎకరాలు, నిజామాబాద్‌లో 18,417 ఎకరాలు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15,317 ఎకరాల్లో పంటలు నష్టపోయాయి.

ఆ తర్వాత అత్యధికంగా నష్టపోయిన జిల్లాల్లో మంచిర్యాల, ఖమ్మం, నిర్మల్, సూర్యాపేట, సిద్దిపేట సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల, పెద్దపల్లి, వనపర్తి, భూపాలపల్లి, మహబూబ్ నగర్ , ములుగు, సిరిసిల్లా, నాగర్ కర్నూల్, నల్గొండ, జగిత్యాల రంగారెడ్డి, కరీంనగర్, మేడ్చల్, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నట్లుగా తెలిసింది. ఈ మేరకు వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడి పరిస్థిని తెలుసుకున్నారు.