calender_icon.png 4 May, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు ఎల్టి రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

03-05-2025 06:22:37 PM

విండో కార్యదర్శి బాబు పటేల్...

మద్నూర్ (విజయక్రాంతి): ప్రభుత్వం ఎల్టి రుణ లబ్ధిదారులకు మళ్లీ అవకాశాన్ని కల్పించిందని, దానిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మద్నూర్ సింగిల్ విండో కార్యదర్శి జె బాబు పటేల్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతులు, రుణాలు చెల్లించడంలో ఏళ్ల తరబడి బకాయిలు ఉన్నాయి. ఈ పెరిగిపోయిన బకాయిల వసూళ్ల కోసం ఎల్టి రుణ లబ్ధిదారులకు వన్ టైం సెటిల్మెంట్ అవకాశాన్ని ప్రభుత్వం మళ్లీ కల్పించింది. కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెల్లడించారు.