calender_icon.png 25 November, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కారీ ఆసుపత్రులకు బండి సంజయ్ సాయం

25-11-2025 12:00:00 AM

  1. రూ.4 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందించిన కేంద్ర మంత్రి

జమ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్ ఆసుపత్రులకు దాదాపు రూ.కోటి చొప్పున విలువైన వైద్య పరికరాల అందజేత

హుజురాబాద్,నవంబర్24(విజయక్రాంతి): దయచేసి ఇకపై ప్రభుత్వ ఆసుపత్రులుకు వచ్చే పేద రోగులను టెస్టుల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు పంపొద్దు. వారిపై భారం మోపద్దు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేదే పేదలు. వారికి రూపాయి ఖర్చు లేకుండా పూర్తి చికిత్స చేసి పంపేలా చర్యలు తీసుకోండి అని కేంద్ర హోంశాఖ సహాయ మం త్రి బండి సంజయ్ కుమర్ కోరారు.

సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి జమ్మికుంట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కేంద్ర మంత్రి సందర్శించారు. ఈ ఆసుపత్రికి దాదాపు కోటి రూపాయల అత్యా ధునిక వైద్య పరికరాలను సీఎస్సార్ నిధుల ద్వారా కొనుగోలు చేసి అందించారు. ఈసీజీ మిషన్, అల్ట్రాసౌండ్ మిషన్, మల్టిపురా మానిటర్, ఆటోక్లేవ్(లార్జ్), డ యా థె ర్మా మిషన్, అనెస్థిషియా వర్క్ స్టేషన్, ఈఎన్టీ హెడ్ లైట్, ఫెటల్ మానిటర్ సహా మొత్తం 15 వైద్య పరికరాలను అందించారు.

యా పరికరాల సేవలను కేంద్ర మంత్రి బండి సంజయ్, కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా ప్రారంభించారు. హుజూరాబాద్, హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులను కూడా సందర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక ద్రుష్టి సారించారు.

ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదు పాయాలు కల్పించడంతోపాటు టెన్త్ క్లాస్ చదివే దాదాపు 20 వేల మంది విద్యార్థులకు ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లను అం దించిన సంగతి తెలిసిందే త్వరలోనే 9వ తరగతి విద్యార్థులకు సైతం సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభంలోనే ప్రభుత్వ స్కూళ్లలో 1 నుండి 6వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్, వాటర్ బాటిల్ తో కూడిన కిట్స్ ను మోదీ గిఫ్ట్ పేరుతో అందించేందుకు ప్రణాళిక రూపొందించారు.

ప్రభుత్వ ఆసుపత్రు ల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా బండి సంజయ్ ప్రత్యేక ద్రుష్టి సారించారు. అందులో భాగంగా జాతీయ ఖనిజాభివ్రుద్ధి సంస్థ(ఎన్‌ఎండీసీ) సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) రూ.4 కోట్ల నిధులను సేకరించి వేములవాడ, జ మ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాలను కొనుగోలు చేసి అందించారు.

గతంలో కరీంనగర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి సైతం తన బర్త్ డే కానుకగా దాదాపు రూ.3 కోట్ల విలువైన అంబులెన్సులు, ఎక్స్ రే మిషన్ సహా అత్యాధునిక వైద్య పరికరాలను బండి సంజయ్ అందించిన విషయంతెలిసిందే.