25-11-2025 12:00:00 AM
ఘట్‌కేసర్, నవంబర్ 24 (విజయక్రాంతి) : హోండా యాక్టివా వాహనం అదుపు తప్పి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దామర్ టమాట (18) తేదీ 23 నవంబర్ రాత్రి సమయం సుమారు 11 గంటలకు దామోదర్‌తో పాటు వాళ్ళ బంధువైన ట మాటా కమల్ (20) సంవత్సరాలు హోండా యాక్టివా పై ఘట్ కేసర్ ఈడబ్ల్యూఎస్ కాలనీ నుండి కీసర వైపు వెళ్తుండగా అజాగ్రత్తతో అదుపుతప్పి రోడ్డు పక్కన గల చెట్లను గుద్దుకొని కిందపడి కలిగిన గాయాలతో అక్కడి కక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఘట్ కేసర్ పోలీసులు తెలిపారు.