calender_icon.png 25 November, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ కాలేజీకి శరీర దానం

25-11-2025 12:00:00 AM

కుటుంబ సభ్యులకు సత్కారం

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): మల్లారెడ్డి మెడికల్ కాలేజీ ఫర్ విమెన్ నందు సోమవారం ‘బాడీ డొనేషన్ ఎ గిఫ్ట్ బియాండ్ లైఫ్ - ఫెలిసిటషన్ అఫ్ డోనర్ ఫామిలీ‘ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరణించిన తర్వాత శరీరాన్ని మెడికల్ కాలేజీలకు దానం చేయుట యొక్క ప్రాధాన్యత గురించి పలువురు ప్రసంగించారు. అనంతరం డోనర్ కుటుంబాలను సత్కరించారు.

ముఖ్య అతిధిగా డా. సుధా శేషయ్యన్, తమిళనాడు డా ఎం జి ఆర్ మెడికల్ యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ పాల్గొన్నారు. డా సుధా రమణ మల్లా రెడ్డి విశ్వవిద్యాపీఠ్ ఛాన్సలర్, డా అనిల్ కౌల్, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ ఛాన్సలర్, గంజి ఈశ్వరలింగం, ప్రెసిడెంట్ అఫ్ అమ్మ ఐ ఆర్గాన్ అండ్ బాడీ డొనేషన్ ప్రోమోటార్స్ ఆర్గనైజషన్, డా శ్రీలత డీన్, మల్లా రెడ్డి మెడికల్ కాలేజీ ఫర్ విమెన్, డా బాబురావు అనాటమీ విభాగ అధిపతి పాల్గొన్నారు.