26-09-2025 10:38:17 PM
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
బాన్సువాడ,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లబాద్ మండల పరిధిలో శుక్రవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పర్యటించారు. నస్రుల్లబాద్ మండలంలోని అంకోల్, కామశెట్టిపల్లి, గ్రామాలలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, కేటాయించిన లబ్ధిదారులు తక్షణమే పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. నిర్మాణంలో ఆలస్యం చేయకుండా ప్రభుత్వం అందిస్తున్న నిధులు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇళ్ల పనులను పూర్తి చేయడంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గ్రామ స్థాయి అధికారులు, సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. గ్రామంలో జరుగుతున్న నిర్మాణ పనులను సక్రమంగా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.