calender_icon.png 27 September, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు షూటింగులూ ఒకేసారి

27-09-2025 12:01:12 AM

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల ‘కింగ్‌డమ్’తో ప్రేక్షకుల ముందుకొ చ్చారు. ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించటంతో ఈ రౌడీ హీరో తన రాబోయే ప్రాజెక్టులతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ ఇంతకు ముందు విజయ్ హీరోగా నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం తో డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత నాని కథానాయకుడిగా ‘శ్యామ్ సింగరాయ్’తో మరో హిట్ అందుకు న్నారు.

ప్పుడు విజయ్ దేవరకొండతో మూడో సినిమా చేస్తున్నారు. విజయ్ హీరోగా నటిస్తున్న 14వ సినిమా కాగా, ఇది 1854 మధ్యకాలంలో జరిగే కథ అని తెలుస్తోంది. వీడీ14’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్టును మైత్రీమూవీ మేకర్స్ రూపొందిస్తోంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే పట్టాలెక్కడం.. ఓ షెడ్యూల్ పూర్తి చేసుకోవడం చకచకా జరిగిపో యాయి. ఇప్పుడు టీమ్ రెండో షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. ఈ షెడ్యూల్ ఈ నెలాఖరులో లేదా అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది.

హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ జరపనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ.. తాను లైన్‌లో పెట్టిన మరో సినిమా గురించి ఇప్పుడు నెట్టింట ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. దసరా సందర్భంగా అక్టోబర్ 2న దీనికి ముహూ ర్తం ఖరారు చేశారట. ఈ సినిమా షూటింగ్ కూడా అక్టోబర్ లేదా నవంబర్ నుంచి ప్రా రంభిస్తారట. అం టే, ఈ రౌడీ హీరో రెండు సినిమాలనూ సమాంతరంగా పూర్తి చేయాలన్న పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారని తెలుస్తోంది.