calender_icon.png 27 September, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనగనగా ఒక రాజు సంక్రాంతికే

27-09-2025 12:00:00 AM

తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి. ఇప్పుడాయన మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కథను స్వయంగా హీరో నవీన్ పొలిశెట్టి రాయడం విశేషం. ఈ చిత్రంతో మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మీనాక్షి చౌదరి ఇందులో నవీన్ పొలిశెట్టి సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. 

 ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రబృందం ‘సంక్రాంతి ప్రోమో’ పేరుతో ప్రత్యేక టీజర్‌ను విడుదల చేసింది. బంగారు ఆభరణాల ప్రకటనపై స్పూఫ్‌తో ప్రారంభమైన ఈ టీజర్ వైవిధ్యంగా ఉంది. ఇందులో మీనాక్షి చౌదరితోపాటు నవీన్ పొలిశెట్టి సైతం నగలు ధరించి కనిపించడం సరదాగా అనిపించింది. ఈ టీజర్‌లో నాయకానాయికలిద్దరూ పోటాపోటీగా నవ్వులు పంచారు. మొత్తానికి ఈ వీడియో ద్వారా తమ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందని చెప్పారు. 2026 జనవరి 14న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్; డీవోపీ: జే యువరాజ్.