26-09-2025 10:33:00 PM
భైంసా: నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ నిరంతరంగా కాటన్ సెర్చ్ కార్యక్రమాల నిర్వహిస్తున్నట్టు ముధోల్ సిఐ మల్లేష్ తెలిపారు. శుక్రవారం బాసర పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించి ప్రజలకు నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు దొంగతనాలు నియంత్రణ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాసర ఎస్సై తోపాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు