calender_icon.png 27 September, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ బాపూజీ 110వ జయంతి వేడుకలు

27-09-2025 06:54:07 PM

గాంధారి (విజయక్రాంతి): గాంధారి మండల కేంద్రంలో శనివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ బాపూజీ 110వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం కార్యదర్శి బండి రాజు మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర పోరాటంలో భాగంగా విద్యార్థి దశలో హైదరాబాదు లో క్విట్ ఇండియా ఉద్యమంలో పోరాటం చేసిన మహనీయుడు అంతేకాకుండా 1952లో ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్లో ఎమ్మెల్యేగా గెలిచి 1957లో చిన్న కోడూరు నియోజవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ స్పీకర్గా ఎన్నికై తెలంగాణ పోరాటంలో తొలి దశ మలిదశ ఉద్యమంలో  1969 మార్చ్ 27న తన మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి గొప్ప నాయకుడు అని అన్నారు.

అంతేకాకుండా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్లి మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి   త్యాగమూర్తి బడుగు బలహీన వర్గాల నాయకుడిగా గుర్తింపు పొందడం జరిగిందని గుర్తు చేశారు. నిజాం పరిపాలనకు మద్దతిస్తున్న రజాకార వ్యవస్థను రూపుమాపడంలో పోరాటం చేసిన మహనీయుడు అని అన్నారు. తన న్యాయవాద వృత్తి ద్వారా ఉచిత న్యాయ సాయం చేసినటువంటి పేదల పక్షపాతి తెలంగాణ ఉద్యమం కోసం తన నివాసం అయినటువంటి జలదృశ్యాన్ని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా కొనసాగడానికి ఆర్థిక సహాయం  చేసినటువంటి మహా పురుషుడు  స్వచ్ఛమైన ప్రజానాయకుడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసి గాంధీయ పద్ధతిలో పోరాటం చేసి తెలంగాణ గాంధీగా పిలువబడ్డాడు కొండలక్ష్మణ్ బాపూజీ 2012 సెప్టెంబర్ 21న మరణించారు.

తెలంగాణ ఏర్పడినప్పుడు ఆయనస్ఫూర్తిని యావత్తు తెలంగాణ ప్రజలు గుర్తించడం జరిగింది బాపూజీ స్వచ్ఛమైన అధికార ప్రతిరూపం ఆయనకు ఆస్తులు  సంపదలు మీద ఆశలు లేవు కేవలం తెలంగాణ ప్రజల హక్కులు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేశారు మన రాష్ట్రంలో ఉన్న బీసీలకు రాజ్యాధికార ప్రాప్తించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతాం అని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుంటుకు అశోక్ సీనియర్ నాయకులు తానాజీ రావు మార్కెట్ కమిటీ చైర్మన్ బండారి పరమేష్  మాజీ సర్పంచ్ సంజు యాదవ్ మాజీఎంపీటీసీలు తూర్పు రాజు పత్తి శ్రీనివాస్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్ద బూరి సత్యం, స్థానిక ఎస్ఐ ఆంజనేయులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు లైన్ రమేష్, సంఘని బాలయ్య, బస శంకర్, శ్రీరామ కమిటీ చైర్మన్ ఎనుగందుల మహేష్, మాజీ ఉప సర్పంచ్ కొమ్ముల రమేష్,సిందే నితిన్, బిజెపి నాయకులు సాయిబాబా, శ్రీకాంత్, సంఘ సభ్యులు మామిడి శ్రీనివాస్, తాటిపాముల సత్యం, ఎను గందుల నందం శ్రీనివాస్ చిట్యాల శ్రీహరి, సామల శేఖర్, తాటిపాముల శివ,కోరండ్ల నాగభూషణం, కొమ్మల సత్యం, తల కొక్కుల శంకర్, క్యాతం కృష్ణ, సంతోష్, కామిని శంకర్, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.