27-09-2025 08:05:30 PM
* స్థానిక సంస్థ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు
* జెడ్.పి.టి.సి., ఎం పి.పి. స్థానాల కొరకు రిజర్వేషన్ల కేటాయింపు
* లాటరీ పద్ధతిలో మహిళల స్థానాల ఎంపిక
* జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి.
రంగారెడ్డి,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలో 21 మండలాల్లో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజర్వేషన్ల కేటాయింపు జరిగింది. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సిఈఓ కృష్ణారెడ్డి తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మహిళా రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా జిల్లాలోని జెడ్.పి.టి.సి., ఎంపిపి. స్థానాల కొరకు ఎస్.టి, ఎస్.సి, బి.సి., జనరల్ రిజర్వేషన్లకు సంబంధించి మహిళా రిజర్వేషన్ కొరకు లాటరీ పద్ధతిన కేటాయింపు నిర్వహించారు.
2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్.సి., ఎస్.టి. రిజర్వేషన్లు, బి.సి. డెడికేషన్ కమిటీ నివేదిక ప్రకారం బి.సి. రిజర్వేషన్ చేపట్టడం జరిగిందని తెలిపారు. జెడ్.పి.టి.సి. కొరకు 3 ఎస్టీ, 4 ఎస్సీ, 9 బీసీ, 5 సాధారణ స్థానాలు కేటాయించడం జరిగిందని, వీటిలో 9 స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఎం. పి. పి. కొరకు 3 ఎస్. టి., 4 ఎస్సీ., 9 బీసీ, 5 సాధారణ స్థానాలు కేటాయించడం జరిగిందని, వీటిలో 9 స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగిందని తెలిపారు. సంబంధిత రిజర్వేషన్ స్థానాల కేటాయింపు వివరాలను ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆయా మండలాల్లో చెందిన జెడ్పిటిసి, ఎంపీపీల కు సంబంధించిన రిజర్వేషన్లు మాత్రం మండలాల వారీగా అధికారికంగా విడుదల చేయలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు మండలాల వారిగా రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
జడీపీటీసీకి సంబంధించి కేటాయింపులు ఇలా!
ఎస్టీ స్థానాలు ఇలా...
1)మంచాల(జనరల్)
2)కొత్తూర్(జనరల్)
3)ఫరూక్నగర్(మహిళ)
ఏస్సీ స్థానాలు ఇలా...
4)శంకరపల్లి (జనరల్)
5)చేవెళ్ల (జనరల్)
6)కందుకూరు( మహిళ)
7)షాబాద్ (మహిళ)
బీసీ స్థానాలు ఇలా...
8) మొయినాబాద్(మహిళ)
9)కొందుర్గు(జనరల్)
10)ఇబ్రహీంపట్నం(మహిళ)
11)కేశంపేట (మహిళ)
12)యాచారం (జనరల్)
13)మహేశ్వరం (మహిళ)
14)తలకొండపల్లి (జనరల్)
15) మాడుగుల (జనరల్)
16)కడ్తాల్ (మహిళ )
జనరల్ స్థానాలు ఇలా...
17) అబ్దుల్లాపూర్మెట్
18)చౌదరి గూడెం
19)నందిగామ
20)శంషాబాద్
21). ఆమనగల్
ఎంపీపీ స్థానాలు ఇలా... ఎస్టీ
1) కొత్తూరు (మహిళ )
2). తలకొండపల్లి,
3) ఫరూక్ నగర్ ఎస్సీ,
4). శంకర్పల్లి(మహిళా),
5). చేవెళ్ల 6). షాబాద్,
7). శంషాబాద్(మహిళ) బిసి,
8). చౌదరి గూడెం,
9). మొయినాబాద్,
10). కొందుర్గు,
11). ఇబ్రహీంపట్నం(మహిళ),
12). కేశంపేట్ (మహిళ),
13). కందుకూరు(మహిళ),
14). మహేశ్వరం (మహిళ)
15). యాచారం,
16). మంచాల జనరల్,
17). అబ్దుల్లాపూర్మెట్ (మహిళ),
18). నందిగామ,
19). ఆమనగల్,
20). మాడుగుల,
21). కడ్తాల (మహిళ),