calender_icon.png 27 September, 2025 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండగ ముందైనా జీతాలు ఇవ్వండి

27-09-2025 06:49:46 PM

పారిశుద్ధ కార్మికుల ఆవేదన

గ్రామపంచాయతీ ముందు నిరసన దీక్ష

మద్దతు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ముందు పారిశుద్ధ కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మాకు జీతాలు రాక మూడు నెలలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ, దసరా  పండగలకు మా పిల్లలకు కొత్త బట్టలు గాని ఇంట్లోకి నిత్యవసర వస్తువులకు కొనడానికి కూడా డబ్బులు లేవని తమ గోడునుపై అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

ప్రజల ఆరోగ్యం కోసం మేము మా ఆరోగ్యం లెక్క చేయకుండా గ్రామాలలోని వీధులు,మురికి కాలువలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ, నీటి సమస్య లేకుండా సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. దుర్గంధము వెదజల్లినా అనారోగ్యం పాలైన ప్రజల కొరకు పని చేస్తున్నా మాకు మాత్రం సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పండగకి జీతాలు ఇవ్వాలని కోరుతూ లేదంటే రాజ్యాంగబద్ధంగా మా హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని డిమాండ్ చేశారు.మా దీక్షకు సహకరించిన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.