08-10-2025 12:08:28 AM
ఆమనగల్,అక్టోబర్ 7: ఆమనగల్ జూనియర్ కోర్టు ఆవరణలో ఆమనగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సుప్రీంకోర్టులో సిజెఐ బిఆర్ గావాయ్ పై న్యాయవాది రాకేష్ కిషోర్ కాలి బూటుతో దాడికి యత్నించిన పరిణామాన్ని ఖండిస్తూ ఆమనగల్ కోర్టులో విధులను బహిష్కరించి నిరసనకు దిగారు. దాడికి పాల్పిడిన న్యాయవాదిపై కఠిన చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆమనగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అండే కార్ యాది లాల్ మాట్లాడుతూ సిజెఐపై దాడిని ఖండిస్తూ చరిత్ర లో చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలా హింస ను ప్రేరేపించే చర్యలు దిగడం సబబు కాదని ఆయన హితవు పలికారు.
కార్యక్రమంలో ఆమనగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అండే కార్ యాదిలాల్, ప్రధాన కార్యదర్శి దుడ్డు ఆంజనేయులు, ఉపాధ్యక్షులు ఏర్పుల రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్ గౌడ్, కోశాధికారి కొప్పు కృష్ణ,క్రీడా కార్యదర్శి శేఖర్, గ్రంథాలయ కార్యదర్శి వసుపుల మల్లేష్, న్యాయవాదులు జానకి రాములు,మధు గౌడ్, గణేష్ గౌడ్, దేవెందర్, జగన్ గౌడ్, ఆంజనేయులు, శేఖర్, మహేశ్వర్, శ్రీనివాస్, బీక్య నాయక్, శ్రీశైలం, ప్రభు తదితరులున్నారు.