calender_icon.png 8 October, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

08-10-2025 12:09:34 AM

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి 

రేగొండ, అక్టోబర్ 7(విజయక్రాంతి): హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు.ఈ మేరకు ఆయన మంగళవారం రేగొండ టౌన్ అధ్యక్షుడు కోలేపాక బిక్షపతి ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజల్ని మభ్య పెడుతు కాలం వెళ్లదీస్తున్న రేవంత్ సర్కార్ కు స్థానిక ఎన్నికల్లో  బిఆర్‌ఎస్ విజయకేతనం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టులా ఉండాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.

అనంతరం కాంగ్రెస్ బాకీ కార్డులను మాజీ ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు హింగే మహేందర్, పి ఎ సి ఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి,బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి,కొడవటంచ ఆలయ మాజీ చైర్మన్ మాధడి కరుణాకర్ రెడ్డి,సీనియర్ నాయకులు పగడాల ఐలయ్య, రమణయ్య,మేకల ఐలయ్య,మాజీ ఉప సర్పంచ్ దుంపేటి పోషలు, బిఆర్‌ఎస్ టౌన్ ఉపాధ్యక్షులు మేకల రాజు, కళ్లెం రవి, బుచ్చిరెడ్డి, చల్ల అశోకు,పాలకుర్తి శ్రీను,రేగొండ సీనియర్ నాయకులు గుర్రాల సుమన్ రెడ్డి, గోగుల చంద్రకర్ రెడ్డి, పత్తి బుచ్చిరెడ్డి, ఏనుగు లింగారెడ్డి,మాజీసర్పంచ్ పసుల రత్నాకర్, మైస సృజన్,యూత్ నాయకులు తడక శ్రీకాంత్ రేగొండ టౌన్ యూత్ అధ్యక్షుడు మాడగాని నరేష్ కేటీఆర్ సేన అధ్యక్షులు ఎడ్ల అనుష్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.