calender_icon.png 25 July, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులను చేర్చుకోని బీఏఎస్ స్కూళ్లు

24-07-2025 01:27:25 AM

- కలెక్టర్ల ఆర్డర్ కాపీలను పట్టించుకోని ప్రైవేట్ స్కూళ్లు

- ఫీజులు చెల్లిస్తామని హామీ పత్రం రాసిస్తేనే చేర్చుకుంటాం

- స్పష్టం చేస్తున్న ప్రైవేట్ యాజమన్యాలు

- ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్న పేరెంట్స్

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం (బీఏఎస్) పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోవడంతో జిల్లాల్లోని కొన్ని ప్రైవే ట్ స్కూళ్లు విద్యార్థులను చేర్చుకోవడంలేదు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధిం చిన బీఏఎస్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను విద్యార్థుల తల్లిదండ్రులకు జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే జారీ చేశారు. అయితే సీటు కేటాయించిన ఆయా పాఠశాలలకు వెళ్లి ఆ ఆర్డర్ కాపీను చూపిస్తే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను స్కూళ్లో చేర్పించుకోవడంలేదు.

పైగా ప్రభుత్వం ఫీజులు చెల్లించకుంటే తాము చెల్లిస్తామని హామీ పత్రం రాసిస్తే అడ్మిషన్లు కల్పిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచిస్తు న్నారు. ఖమ్మం జిల్లాలోని సెంచురీ హై ప్రొఫైల్ స్కూల్‌కు వెళ్లిన ఓ పేరెంట్‌కు ఇదే అనుభం ఎదురైనట్లు వారు తెలిపారు. స్వయంగా జిల్లా కలెక్టర్ జారీచేసిన ఆర్డర్‌ను సైతం పాఠశాలల యాజమన్యాలు ఖాతరు చేయడంలేదని వాపోయారు. ఈ పరిస్థితి ఈ ఒక్క జిల్లాలోనే కాదు. దీంతో చేసేదిలేక ఈ పథకం కింద అర్హులైన చాలా మంది తమ పిల్లలను ఫీజులు కట్టి వేరే స్కూళ్లలో చేర్పిస్తున్నారు.

జూన్ 12 నుంచి 2025 నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైంది. జూలై నెల గడుస్తోంది. అయినా చాలా వరకు బీఏఎస్ స్కూళ్లు అడ్మిషన్లను కల్పించడంలేదు. ఇప్పటికే ఎఫ్‌ఏ పరీక్షలు ప్రారంభమయ్యాయి కూడా. ఈ క్రమంలో తమ పిల్లలకు అడ్మిషన్లు కల్పించకుంటే విద్యాసంవత్సరం కోల్పోప్రమాదం ఉందని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై తక్షణమే చర్యలు తీసుకొని ఉచిత విద్యను అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

నిధుల విడుదలపై అతీగతీలేదు

ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు చెల్లించాల్సిన బీఏఎస్ పెండింగ్ బకాయి నిధులకు అతీగతీలేదు. 2022 నుంచి 2025 ఏప్రిల్ వరకు దాదాపు రూ.200 కోట్ల వరకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాల్సి ఉంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరవాత ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రైవేట్ పాఠశాలలు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఇచ్చిన హామీ నెలరోజులు కావొస్తొన్నా అమలుకు నోచుకోవడంలేదు.

రెండ్రోజుల్లో పెండింగ్ నిధులను ఖాతాలో జమ చేస్తామని జూలై 1వ తేదీన మీడియా సమావేశంలో మంత్రి హామీ ఇచ్చినట్లు ప్రైవేట్ పాఠశాలల యా జమాన్యాలు తెలిపాయి. అయితే ఇంతవరకూ తమ ఖాతాల్లో నిధులు జమకాలే దని  యాజమాన్యాలు చెబుతున్నా యి. మూడేళ్లుగా బకాయిలు పేరుకుపోవడం తో ఈ స్కీం కింద కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులను స్కూళ్లలో చేర్పించుకు నేందుకు ముందుకు రావడంలేదు. ఇంకొ న్ని జిల్లాల్లో మాత్రం కలెక్టర్ల ఆదేశాలతో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తున్నాయి.