15-09-2025 12:16:36 AM
ఎల్లారెడ్డి సెప్టెంబర్ 14,(విజయ క్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని బి సి సంక్షేమ బాలికల వసతి గృహం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర బతుకమ్మ సంబరాలను ముందస్తు ఆదివారం జరుపుకున్నారు. ఇందులో భాగంగా వసతి గృహ మ్యాట్రిన్ విజయశాంతి ఆధ్వర్యంలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ కోలలు వేస్తూ సంబరాల జరుపుకున్నారు.
వేషాధారణ చేపట్టి, బతుకమ్మలు పేర్చి బాలికలు సంప్రదాయ దుస్తులు ధరించి ఆనందోత్సవాలతో పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. బాలికల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు, చేశారు. ఈ సమావేశంలో బాలికల తల్లిదండ్రులతో వసతి గృహ నిర్వాహకురాలు విజయశాంతి మాట్లాడారు పిల్లలకి ప్రభుత్వం అందించే కాస్మోటిక్, అందిస్తున్నట్లు, మేను ప్రకారమే పిల్లలకు భోజనం అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వసతి గృహ నిర్వాహకురాలు, విజయశాంతి,, వసతి గృహ సిబ్బంది స్వప్న ,రాధ, నస్రిన్, వసతి గృహ బాలికలు పాల్గొన్నారు.