15-09-2025 12:18:43 AM
కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 14 (విజయ క్రాంతి): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా ముగిసింది. ఈ లోక్ అదాలత్లో మొత్తం 3130 కేసులు పరిష్కారమయ్యాయని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఒక ప్ర కటనలో తెలిపారు. పెండింగ్లో ఉన్న 568 కేసులతో పాటు, 210 ఈ - పెట్టి కేసులను, 2149 డ్రంక్ అండ్ డ్రైవ్, ఇతర మోటార్ వెహికల్ చట్ట ఉల్లంఘన కేసులను పరిష్కరించారని పేర్కొన్నారు.
సైబర్ నేరా లకు సంబంధించిన కేసుల్లో బాధితుల ఖాతాల్లో నిలిపివేసిన 25,79,883 రూపాయలను 103 కేసుల ద్వారా బాధితులకు కోర్టుల సమక్షంలో తిరిగి ఇప్పించడం జరిగిందని కమిషనర్ వివ రించారు. ఈ లోక్ అదాలత్ నిర్వహణలో సహకరించిన గౌరవ న్యాయమూర్తులకు, పబ్లిక్ ప్రాసి క్యూటర్లకు, న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి, ప్రజలకు, కక్షిదారులకు కృతజ్ఞతలు తెలిపారు.