calender_icon.png 20 September, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల పాఠశాలలో బతుకమ్మ సంబురాలు

20-09-2025 12:00:00 AM

జిన్నారం, సెప్టెంబర్ 19 : జిన్నారం పట్టణంలోని గిరిజన గురుకుల పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. దసరా సెలవుల నేపథ్యంలో ముందుగానే ఈ వేడుకలను నిర్వహించినట్లు పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపల్ వెంకటయ్య తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఆటపాటలతో బతుకమ్మ ఆడుతూ తెలంగాణ  సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింబించారు.

అనంతరం బతుకమ్మలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపల్ వెంకటయ్య మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలు విద్యార్థుల్లో సమైక్యతను పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.