20-09-2025 12:00:00 AM
న్యాయ సేవాధికార కార్యదర్శి సౌజన్య
సంగారెడ్డి, సెప్టెంబర్ 19 : జిల్లా న్యాయ సేవాాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనలతో జిల్లా న్యాయ సేవాాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య శుక్రవారం సంగారెడ్డి పట్టణం ప్రభుత్వ మహిళా నర్సింగ్ కళాశాలలో న్యాయ అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ అవగాహన శిబిరం కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ కళాశాలలో ఉన్న ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, మీరు చదువుతున్న కోర్సు పేద వాళ్లకి ఉపయోగ పడాలని తెలిపారు.
పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారి బాగోగులను కూడా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గృహ హింస, బాల్య వివాహ నిషేధ చట్టం, పోస్కో చట్టం, వరకట్న నిషేధ చట్టాలపై అవగహన కలిగి ఉండాలి అన్నారు.
విద్యార్థులకు, ఉపాధ్యాయులకు న్యాయ పరమైన విషయాలలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, ఏదైనా న్యాయ సహాయం కోరినచో న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ సదస్సులో ప్రిన్సిపాల్ ,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.