20-09-2025 12:00:00 AM
హాజరైన ఎంపీ కడియం కావ్య
కాకతీయ యూనివర్సిటీ, సెప్టెంబర్ 19(విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కళాశాల, హాస్టల్లో విద్యార్థులకు అవసరమైన వసతులు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటానని భరోసానిచ్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండుగ నిదర్శనమని, పండగను విద్యార్థినులు ఘనంగా నిర్వహించడం పట్ల అభినందించారు. బతుకమ్మ వేడుకల్లో కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ ఆచార్య కట్ల రాజేందర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.బిక్షాలు, దూరవిద్య డైరెక్టర్ సురేష్ లాల్, సెల్ఫ్ ఫైనాన్స్ డైరెక్టర్ ఆచార్య ఐలయ్య, ఆచార్య వరలక్ష్మి, బోధనేతార సిబ్బంది ఏ.ఆర్ వెంకటేశ్వర్లు, పర్యవేక్షణ అధికారి వీరు నాయక్ అధ్యాపకులు పాల్గొన్నారు.