calender_icon.png 23 September, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాగేశ్వరి కళాశాలలో బతుకమ్మ సంబరాలు

23-09-2025 07:07:58 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): తెలంగాణ ఆడబిడ్డల ఆరాధ్య పండుగ బతుకమ్మను కరీంనగర్ పట్టణంలోని వాగేశ్వరి డిగ్రీ & పిజి కళాశాల, వాగేశ్వరి ఉమెన్స్ డిగ్రీ & పిజి కళాశాలల్లో ఘనంగా ఉత్సాహభరితంగా ముందస్తుగా జరుపుకున్నారు. విద్యార్థినులు పసుపు, గుమ్మడిపువ్వు, గద్ద, తుమ్మెద వంటి స్థానిక పూలతో అద్భుతంగా బతుకమ్మలను పేర్చారు. చిన్నా పెద్ద వలయాలుగా కూర్చొని సాంప్రదాయ గీతాలు ఆలపిస్తూ, ఆటపాటలతో అలరించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన చైర్మన్ శ్రీ బివిఆర్ గోపాల్ రెడ్డి, సెక్రటరీ డాక్టర్ రత్న గోపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రోహిణి జైపాల్ రెడ్డి బతుకమ్మ గురించి మాట్లాడుతూ.. వాగేశ్వరి కళాశాలలు విద్యార్థులను కేవలం పాఠ్యపుస్తకాలతోనే కాకుండా సాంప్రదాయం, సంస్కృతి, క్రీడా విలువలతో కూడిన సమగ్ర వ్యక్తిత్వం కలవారిగా తీర్చిదిద్దుతున్నాయి. బతుకమ్మ పండుగ మన భూమ్మాతను, ప్రకృతిని కీర్తించే ఒక సాంస్కృతిక ఉత్సవం. ఇలాంటి పండుగలు విద్యార్థుల్లో సామాజిక చైతన్యం, మహిళా శక్తి, ఐక్యతా భావం పెంచుతాయని అన్నారు. ఈ వేడుకల్లో విద్యా సంస్థల ప్రిన్సిపల్స్ జి. సతీష్ గౌడ్, టి. లింగమూర్తి, పి. వెంకట్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్స్ చెన్నమల్ల చైతన్య, సి. హెచ్. రమణ చారి, ప్రసాద్, నరేందర్ రెడ్డి, ఏవోలు నిజా ముద్దీన్, వేదవ్యాస్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు విస్తృతంగా పాల్గొన్నారు.