calender_icon.png 24 September, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటిపై పడిన పిడుగు

23-09-2025 07:08:00 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ముఠాపూర్ రవి అనే ఇంటిపై మంగళవారం మధ్యాహ్నం పిడుగుపడింది. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో గంటసేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురువగా అదే సమయంలో ఇంటి గోడకు పిడుగు కొట్టడంతో రెండు పిల్లర్లు దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా శబ్దం రావడంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఏం జరిగిందన్న ఆందోళన వ్యక్తం చేయగా ఆ తర్వాత పరిశీలించగా ఇంటిది మరి దెబ్బ తినడంతో పిడుగు పడినట్లు నిర్ధారించుకొని ఊపిరి పీల్చుకున్నారు