23-09-2025 10:12:37 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): సామాన్య, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం జీఎస్టీలో సమూల మార్పులను తీసుకొచ్చిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గతంలో ఉన్న నాలుగు స్లాబ్ లను రెండు స్లాబ్ లకు తీసుకొని రావడం అందులోనూ సామాన్యులు మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే అనేక వస్తువుల్లో టాక్స్ ను తొలగించడం కొన్ని వస్తువులకు 05 శాతం కుదించడం వల్ల పేదలకు మేలు జరిగిందని అన్నారు.
వస్తువుల ధరలు తగ్గడం వల్ల కొనుగోలు సామర్థ్యం పెరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 3.25 కోట్ల మందికి ప్రయోజనం చేకూరడంతో పాటు 35 నుంచి 40 వేల కోట్లు ఆదా అవుతుంది అని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పార్లమెంట్లో తీసుకునే నిర్ణయాలతో దేశం అన్ని రంగాల అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.