calender_icon.png 24 September, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవరాత్రుల శోభ... మణికొండలో అమ్మవారి వైభవం

23-09-2025 10:08:34 PM

మణికొండ,(విజయక్రాంతి): మణికొండ పురవీధులు భక్తి పారవశ్యంతో పులకించిపోతున్నాయి. ప్రఖ్యాత పోచమ్మ ఆలయ ప్రాంగణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. లోక కల్యాణాన్ని, ప్రజల సుఖసంతోషాలను ఆకాంక్షిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారు రోజుకో అలంకారంలో భాగంగా రెండ‌వ రోజు గాయ‌త్రీ దేవీ రూపంలో భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు.

ప్రతి అవతారానికి విశిష్ట పూజలు, ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తున్నట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. మొద‌టి, రెండ‌వ రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చార‌ని క‌మిటీ స‌భ్యులు తెలిపారు. ఈ వేడుకల్లో ప్రముఖులు దొడ్డి లక్ష్మణ్ రాఘవ రెడ్డి, భక్తులు, బి శ్రీశైలం బి నవీన్ బి దిలీప్ ఎం సంతోష్ డి శ్రీరాములు స్థానికులు పాలుపంచుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.