calender_icon.png 24 September, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీని విజయవంతం చేయాలి

23-09-2025 10:37:08 PM

లంబాడి జేఎస్సీ మండల నాయకులు పిలుపు

గరిడేపల్లి,(విజయక్రాంతి): ఈ నెల 26న హుజూర్నగర్ నియోజకవర్గంలో నిర్వహించే లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీని విజయవంతం చేయాలని లంబాడీల జేఏసీ నాయకులు అన్నారు.మంగళవారం లంబాడి మండల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పలువురు నాయకులు పాల్గొని మాట్లాడారు. లంబాడి ఆచారాల ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని ప్రతి ఒక్కరు గ్రామం, తండాల నుంచి లంబాడి విద్యార్థి నాయకులు ఉద్యోగ సంఘాలు నాయకులు మహిళా నాయకురాలు లంబాడి జేసి నాయకులు సేవాలాల్ మహారాజ్ నాయకులు అన్ని గ్రామాల తండా వాసులు ప్రతి ఒక్కరు హుజూర్నగర్ లో తలపెట్టి ర్యాలీలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.