calender_icon.png 24 September, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట పొలాల్లో వ్యక్తి శవం లభ్యం

23-09-2025 10:41:03 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ గాంధీనగర్ శివారు పంట పొలాల్లో వ్యక్తి షవం లభ్యమైనట్లు ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాయిడ్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి గాంధీనగర్ శివారులో పంట పొలాల్లో కుళ్లిపోయిన వ్యక్తి శవం ఉందని సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఎస్ఐ రాహుల్ ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకోగా మృతుని పేరు కత్తెరపాక శ్రీనివాస్(45) ఇతనికి కుటుంబం,

భార్య పిల్లలు ఎవరూ లేకపోవడంతో, గాంధీనగర్, ఖానాపూర్ టౌన్ లో భిక్షాటన చేస్తూ తిరిగేవాడని గత ఐదు రోజులుగా ఈ వ్యక్తి ఎక్కడ కనిపించకపోవడంతో, స్థానికులు పొలం పనులకు వెళ్తుండగా దుర్వాసన రావడంతో అక్కడ శవం ఉందని కనిపెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వ్యక్తి మతిస్థిమితం సరిగా లేకపోవడం వలన, ఆరోగ్య సమస్యల వలన చనిపోయి ఉండవచ్చని అతని కుటుంబ సభ్యులు బంధువులు తెలిపినట్లు, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.