23-09-2025 10:27:51 PM
తాండూరు,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరం లాంటిదని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి కోరారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన బషీరాబాద్, యాలాల్, తాండూరు, పెద్దేముల్, కోట్పల్లి మండలాలకు, తాండూరు పట్టణానికి చెందిన 157 మంది లబ్ధిదారులకు రూ. 60,00,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.