calender_icon.png 24 September, 2025 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు వ్యవసాయం బోర్ మోటర్ స్టాటర్ డబ్బాల కాడ జరా జాగ్రత్త

23-09-2025 10:05:31 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామ శివారులోని రైతు బసిరెడ్డి గారి భద్ర రెడ్డి తన వ్యవసాయ భూమిలోని పంట పొలానికి బోర్ మోటర్ వెయ్యడానికి రోజు మాదిరిగా మంగళవారం నాడు వెళ్ళాడు స్టాటర్ డబ్బా (బాక్స్)లో విషపురితాలు (సర్పం) కుసుమ ఉంది. రైతు భద్ర రెడ్డి మాట్లాడుతూ... రైతులకు ముందస్తు జాగ్రత్తగా తెలిపిని విషయం ఏమిటంటా రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్తుంటారు. ముందస్తుగా తమ బోర్ మోటర్ స్టాటర్ బాక్స్ పట్ల జాగ్రత్త ఉండాలన్నారు. ముందే వర్ష కాలం కాబట్టి మోటర్ బాక్స్ (డబ్బా)లల్లో విషపూరితాలు (సర్పలు) వెళ్లే అవకాశం ఉంటుంది.

కాబట్టి ముందస్తుగా స్టాటర్ బాక్స్ (డబ్బ)కు కట్టేతో లేత విద్యుత్ టెస్టర్ సహాయంతో బాక్స్ ను తెరవాలని, స్టాటర్ ను పరిశీలించి మోటర్ ను వెయ్యాలని అన్నారు. ఒకవేళ మనం పరిశీలించకుండా స్టాటర్ బాక్స్(డబ్బా) ను ఓపెన్ చేస్తా విషపూరితాలు కాటేసె అవకాశం ఉంటుందని కాబట్టి రైతులు జాగ్రత్త పడాలన్నారు. మోటర్ వేసే సమయంలో స్టాటర్ బాక్స్ ను పరిశీలించి వాడలని అన్నారు. కోవేళ పరిశీలించకుండా రైతులు మోటర్ స్టాటర్ బాక్స్ ను ఓపెన్ చేస్తే విషపూరితాలు (సర్పలు) కాటేసె అవకాశం ఉంటుందని, ప్రాణ పాయం జరిగే అవకాశం ఉంటుందని రైతు బసిరెడ్డి గారి భద్ర రెడ్డి రైతులకు హెచ్చరించారు.