20-09-2025 06:46:50 PM
కొండపాక: మండల కేంద్రమైన వేద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం నాడు ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. రేపటినుండి బతుకమ్మ పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవులు ఇచ్చారు .పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు రేపటి నుండి పాఠశాలకు 10 రోజుల వరకు రావడం కుదరదు పాఠశాలలో ఒకటి నుండి 10వ తరగతి విద్యనభ్యసిస్తున్న విద్యార్థినిలు ఉపాధ్యాయులతో కలిసి ముందస్తుగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. సంబరాలలో విద్యార్థినీ విద్యార్థులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.