calender_icon.png 20 September, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయాలి

20-09-2025 06:45:55 PM

మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు

మందమర్రి,(విజయక్రాంతి): నూతన ఆవిష్కరణల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పట్టణ మున్సి పల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు కోరారు. పట్టణం లోని కార్మెల్  పాఠశాలలో శనివారం నిర్వహించిన స్కిల్స్ స్పార్క్లింగ్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు సెల్ ఫోన్ల వాడకాన్ని తగ్గిస్తూ నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలన్నారు.

అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం జేవియర్ రెక్స్ మాట్లాడుతూ  పిల్లల లోని సృజనాత్మకతను వెలికితీస్తూ పాఠ్యపుస్తకాల సారాన్ని నిజ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో తెలియ చేయడం కోసమే స్పార్క్లింగ్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నా మన్నారు. అదే విధంగా పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలను  నిర్వహిస్తూ విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని  నింపుతూ పండుగ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వ హించారు.