calender_icon.png 21 September, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారాయణ స్కూల్ అనుమతులపై ఆర్జేడీ గరం

21-09-2025 12:00:00 AM

-రెండు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని డీఈవోకు ఆదేశం 

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేసిన నారాయణ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలపై రీజనల్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీప పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి ఎన్‌ఓసి లేకపోవడం, అనుమతుల కోసం దరఖాస్తు చేసిన ప్రదేశంలో కాకుండా వేరే ప్రాంతంలో పాఠశాల నిర్వహించడంపై విజయక్రాంతి దినపత్రికలో ప్రచురితమైన కథనాలపై ఆయన స్పందించారు. అనుమతులపై పూర్తి నివేదిక సమర్పించాలని డీఈవో నాగలక్ష్మిని ఆదేశించారు. డీఈవో నాగలక్ష్మి నారాయణ పాఠశాల అనుమతులపై సమగ్ర నివేదిక సమర్పించాలని పాల్వంచ ఎంఈవో శ్రీరామ్‌మూర్తిని ఆదేశించారు. రెండు రోజుల్లో పూర్తి సమాచారం అందించాలన్నారు.