29-09-2025 12:31:54 AM
సంగారెడ్డి, సెప్టెంబర్ 28 :తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పం డుగను సంగారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో సంగారెడ్డి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ బద్ధంగా పూలతో బతుకమ్మలను పేర్చి నృత్యాలు చేస్తూ ఆనందంగా వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తూ సమాజంలో ఐక్యత, స్నేహభావం పెంపొందించే వేదికగా నిలుస్తాయని మహి ళా ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మహిళా ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలతో సంబరాలను జరుపుకున్నారు.