29-09-2025 12:30:38 AM
చేగుంట, సెప్టెంబర్ 28 :దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని గ్రామ వైశ్య సంఘం సభ్యులు పబ్బ శ్రీనివాస్, పబ్బ నాగేష్, శ్రీరామ్ చంద్రమౌ ళి అన్నారు. ఆదివారం చందాయిపేట గ్రా మంలో శివాజీ యూత్ సభ్యులు ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి మండపం వద్ద కుంకుమార్చనలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కా ర్యక్రమంలో గ్రామ పెద్దలు, దేవీ నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళ భక్తులు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన, పబ్బ శ్రీనివాస్, పబ్బ నాగేష్, శ్రీరామ్ చంద్రమౌళి, శివాజీ యూత్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.