30-09-2025 12:00:00 AM
శాస్త్రవేత్తలతో చర్చించిన కామారెడ్డి ఎమ్మెల్యే
కామారెడ్డి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సోమవారం హైదరాబాద్ లో ఇక్రిషార్ట్ శాస్త్రవేత్తలతో ముచ్చటించారు. కామారెడ్డి నియోజకవర్గంలో రైతులు చిరుధాన్యాల సాగుపై మోగ్గు చూపుతున్నారని వివరించారు. హైదరాబాద్ పటాన్‌చేరు వద్దగల ఇక్రిసాట్‌ను సందర్శించారు. ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హరి కిషన్ రెడ్డి, ఇతర శాస్త్రవేత్తలు ఇక్రిసాట్‌లో జరుగుతున్న వ్యవసాయ పరిశోధనల గురించి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి వివరించారు.
డాక్టర్ హిమాన్షు పాఠక్, డైరెక్టర్ జనరల్ ఇక్రిసాట్ శాసనసభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై హైదరాబా దులో అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం స్థాపించినప్పటి నుండి ఇప్పటివరకు జరిపిన ప్రముఖ పరిశోధనల గురించి మరియు ఇక్రిశాట్ ప్రాధాన్యత గురించి , ఆఫ్రికా మరియు ఇతర ప్రపంచ దేశాల రైతులకు చేస్తున్న సేవల గురించి తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా శాసన సభ్యులు డైరెక్టర్ జనరల్‌తో ప్రస్తుత వ్యవసాయ సవాళ్లు, వారి అనుభవాలను పంచుకోవడం జరిగింది.రైతుల అభ్యున్నతి కోసం ఇక్రిసాట్ ఏ విధంగా ఉపయోగపడగలదో తెలుసుకునేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చించడానికి ఈ పర్యటన చేపట్టినట్లు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తెలిపారు. కామారెడ్డి ప్రాంతం వ్యవసా య పరిస్థితులకు చిరుధాన్యాల సాగుకు ఎంతగానో అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.
ఈ ప్రాంత రైతులు ముందుకు వచ్చి ఆసక్తి చూపినట్లయితే ఎంపిక చేసిన గ్రామాలలో చిరుధాన్యాల సాగును పెద్ద ఎత్తున చేపట్టవచ్చని దానికి ఇక్రిశాట్ సహకారం ఉంటుందని తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గం లో చిరుధాన్యాల సాగుకు రైతులు ఆసక్తి కనపరుస్తున్నారు అని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తెలుపడంతో ఈక్రిషాట్ శాస్త్రవేత్తలు తమ వంతు సహకారం అందిస్తాం అని తెలిపారు.
సమ భావన సంఘాలకు ఇక్రిశాట్ వారి సహకారంతో అమలు చేస్తున్న పథకాన్ని కామారెడ్డి నియోజకవర్గం లో శాసన సభ్యుల సహకారంతో విజయవంతంగా అమలు పరుస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కార్యక్రమం లో శాస్త్రవేత్తలు డాక్టర్ ఎస్ కె గుప్తా, డాక్టర్ ఈ ప్రేమ్ అభియారి మన, డాక్టర్ ప్రకాష్ గంగిశెట్టి, డాక్టర్ శోభన్, డాక్టర్ కుల్దీప్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.