ఆరుట్ల నుంచే సరికొత్త విద్యావిప్లవం
- తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు
- 17న సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
- తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలన్న ఎమ్మెల్యే మల్ రెడ్డి
- కలెక్టర్, సీపీ, విద్యాకమిషన్ ఛైర్మన్ తో కలిసి ఏర్పాట్ల పరిశీలన
ఇబ్రహీంపట్నం, జూన్ 15 : రాష్ట్రంలో సరికొత్త విద్యావిప్లవానికి శ్రీకారం చుట్టేలా ఆరుట్ల గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫైలెట్ ప్రాజెక్టు కింద నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ స్కూల్ ప్రారంభోత్సవం జరగనుంది. బుధవారం ఉదయం 9.30గంటలకు హెలీక్యాప్టర్ లో ఆరుట్లకు చేరుకోనున్న సీఎం, మొదటగా టీపీఎస్ ను ప్రారంభించనున్నా రు.
అనంతరం, పాఠశాలను సందర్శిస్తారు. తర్వాత, అల్పాహార పథకాన్ని ప్రారంభించి, విద్యార్థులతో కలిసి, బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. అక్కడి నుంచి ప్రాథమిక పాఠశాల భవనం సందర్శించి, అక్కడి సౌకర్యాలు, క్రీడాప్రాంగణం, కంప్యూటర్ ల్యాబ్, తదితర సౌకర్యాలు పరిశీలించనున్నారు.11గంటల తర్వాత బహిరంగసభకు హాజరుకానున్నా రు. అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి.తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా కలెక్ట ర్ నారాయణరెడ్డి, సీపీ తరుణ్ జోషీ, విద్యాకమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్, బహిరంగసభ వద్ద ఏర్పాట్లను పరిశీలించి, దిశానిర్దేశం చేశారు. అక్కడి నుం చి పాఠశాలను సందర్శించి, సీఎం పర్యటనపై కలెక్టర్, సీపీ, ఇతర అధికారులకు ఎమ్మె ల్యే మల్ రెడ్డి,ఆదేశాలు జరిచేశారు విద్యాకమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి పలు సూచనలు చేశారు. జనసమీకరణ, సౌకర్యా లు, భద్రతకు సంబంధించిన అంశాలపై అ ధికారులతో చర్చించారు. తెలంగాణ ఈ తరహా పాఠశాలలను ప్రభుత్వం నిర్మించనుందని ఆకునూరి మురళి తెలిపారు.






