calender_icon.png 16 September, 2025 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను నిండా ముంచుతున్న ప్రభుత్వాలు

16-09-2025 12:47:03 AM

మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు

లక్షేట్టిపేట, సెప్టెంబర్ 15: రైతుల సాగుకు అవసరమైన యూరియా ఇయ్యకుండా నిం డా ముంచుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మారాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. సోమ వారం మున్సిపాలిటీలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతాంగానికి మద్దతుగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ధర్నా నిర్వహించి, తహసిల్దార్ దిలీప్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు యూరియా అందక ఇబ్బందులు పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సిగ్గుచేటని హెద్దేవా చేశారు. రైతులపై నిర్లక్ష్య వైఖరిని వీడి రైతులకు యూరియా అందించాలన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో రైతులకు ఏలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్న ఘనత  బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు.

రాబోయే ఎలక్షన్ లలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు, ప్రజలు సరైన బుద్ధి చెప్తారని తెలిపారు. రైతులకు సరిపడా యూరియా అందించకపోతే బీఆర్‌ఎస్ ప్రభుత్వం  చూస్తూ ఊరుకో దని, అసెంబ్లీ ముట్టడి చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ రావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ తిప్పని లింగయ్య, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చుంచు చిన్న య్య, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.