18-10-2025 03:20:06 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ మండల నూతన వ్యవసాయ అధికారిగా పైడితల్లి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కాట్నపల్లి రైతు వేదికలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఏడీఏ శ్రీనాథ్ ఆధ్వర్యంలోమండల ఫర్టిలైజర్స్ అసోసియేషన్ డీలర్లు పుష్ఫగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఏవో పైడితల్లి మాట్లాడుతూ రైతులకు ఏ సమస్య వచ్చిన వెంటనే సంప్రదించాలని కోరారు. రైతు బంధు, రైతు భీమ వంటి వాటికి ఇంక ఎవరైన దరఖాస్తులు చేసుకొని వారు ఉంటే వ్యవసాయ కార్యాలయంలోకి వచ్చి చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్ డీలర్ల సంఘం అధ్యక్షుడు మట్ట శ్రీనివాస్ రెడ్డి, గట్ల మల్లారెడ్డి, తిరుపతి రావు, రవీందర్ రావు, సిరిపురం రమేష్‌తో పాటు పలువురు డీలర్లు పాల్గొన్నారు.