18-10-2025 03:01:34 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం గట్టెపల్లిగ్రామానికి చెందిన సంపత్ కుమార్ ను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అభినందిస్తూ సన్మానం చేశారు... ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ వారు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కాళోజి జాతీయ సాహిత్య పురస్కారం 2025 అవార్డు సంపత్ కుమార్ అందుకున్నారు. దీన్ని పురస్కరించుకొని శనివారం శివపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో సన్మాన కార్యక్రమం జరిగింది,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... 52 గ్రంథాల రచయిత సంపత్ కుమార్ కు జాతీయ పురస్కారం రావడం అభినంద నీయమన్నారు. తెలంగాణ భాష మీద పరిశోధన చేసి గ్రంథాలు రచించాడు. సంపత్ కుమార్ కరాటే, యోగ విద్యలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంపత్ కుమార్ వివిధ రకాలుగా సమాజసేవ లో ఉండడం, 68 సార్లు రక్తదానం చేయటం సంతోషం అని ఎమ్మెల్యే అన్నారు. అలాగే సంపత్ కుమార్ ను గట్టపల్లి గ్రామానికి చెందిన సుల్తానాబాద్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధనాయక్ దామోదర్ రావు , నాయకులు కొలిపాక పెద్దన్న , మాజీ ఎంపిటిసి శంకర్, కోడెం అజయ్ , ధనాయక్ శ్రీనివాసరావు, నగునూరి వెంకటేశం , ఆవోప జిల్లా కార్యదర్శి పల్లా సురేష్ గ్రామ ప్రజలు హార్షం వ్యక్తం చేస్తూ సంపత్ కుమార్ ను అభినందించారు...