calender_icon.png 18 October, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ల్యాంకో హిల్స్‌లో సెక్యూరిటీ సిబ్బందిపై 30 మందితో దాడి

18-10-2025 02:57:58 PM

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్(Raidurgam Police Station) పరిధిలో ల్యాంకో హిల్స్ లో(Lanco Hills) సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశాడు. సెక్యూరిటీ సిబ్బందిపై ల్యాంకో హిల్స్ లో ఉండే మురళీ, అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ నెల 15న సెక్యూరిటీ సిబ్బందిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బండి రిజిస్ట్రేషన్ స్టిక్టర్ లేకపోవడంతో మురళీ వాహనాన్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నాడు. వాహనం ఆపడంతో వాగ్వాదం జరిగి సెక్యూరిటీ సిబ్బందిపై మురళీ దాడి చేశాడు. మరోసారి 30 మందితో అపార్ట్ మెంట్ వద్దకు తన అనుచరులతో వచ్చిన మురళీ దాడికి దిగాడు. దాడిలో సెక్యూరిటీ సిబ్బంది బాలకృష్ణ, మేనేజర్ చంద్రయ్యకు గాయాలయ్యాయి. దాడి చేసేందుకు వచ్చిన వారి కారుకు పోలీస్ స్టిక్టర్లు ఉన్నాయని సెక్యూరిటీ సిబ్బంది ఆరోపించారు. బాధితుల ఫిర్యాదుతో మురళీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.