02-09-2025 05:30:42 PM
టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
కామారెడ్డి,(విజయక్రాంతి): అసెంబ్లీలో బిసి బిల్లు ప్రవేశపెట్టిన బిల్లుతో బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలేశ్వరంపై ప్రజాధనాన్ని వేల కోట్లు దుర్వినియోగం చేసిన కేసీఆర్ పై సిబిఐ విచారణ జరగాల్సిందేనన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు అప్పుడు ప్రభుత్వంలో ఉండి అవినీతిపై ఎందుకు మాట్లాడ లేదు కవితక్క సమాధానం చెప్పాలన్నారు. వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అన్నారు. కాలేశ్వరం అవినీతిపైన అసెంబ్లీలో చర్చ తర్వాత ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం ప్రజలందరికీ తెలిసిందే అన్నారు. బిఆర్ఎస్ కు ఇక నూకలు చెల్లాయని అన్నారు.
కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితక్కలు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. సిబిఐ విచారణలో వారు చేసిన అవినీతి బయటపడుతుందని దిగులుతోనే రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ కార్యకర్తలతో ఆందోళన కార్యక్రమాలు చేయించడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ఇకనైనా టిఆర్ఎస్ నాయకులు తప్పుడు ధర్నాలు, రాస్తారో కోలు చేయవద్దన్నారు. ప్రజలందరికీ తెలుసని తెలంగాణను లూటీ చేసింది టిఆర్ఎస్ ముఖ్య నేతలు కాదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పంపరి శ్రీనివాస్, ఉరుదొండ రవికుమార్, బండారు శ్రీకాంత్, సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.