calender_icon.png 17 October, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ న్యాయబద్ధమైనది

16-10-2025 05:48:17 PM

ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ న్యాయబద్ధమైనదని, బీసీలకు దక్కాల్సిన హక్కుని ఈనెల 18న జరిగే బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బందుకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుందని ఇల్లందు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ముద్రగడ వంశీ తెలిపారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీసీల రిజర్వేషన్ అంశం ప్రధాన చర్చ జరుగుతుందని, స్వాతంత్రం అనంతరం బీసీలకు రాజ్యాధికారం అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు.

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయంలోనే బీసీలకు అనేక రంగాలలో మంచి అవకాశాలు కల్పించడమే కాకుండా రాజకీయంగానూ రాష్ట్ర స్థాయి నేతలుగా గుర్తింపును తీసుకొచ్చిందన్నారు. 42 శాతం రిజర్వేషన్ బీసీలకు న్యాయమైన హక్కని అన్నారు. ఈ సమావేశంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు చాందావత్ రమేష్ బాబు, బయ్యారం మండల అధ్యక్ష కార్యదర్శులు కోటేశ్వరరావు, శ్రీహరి, ఇల్లందు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పాలమాలు బాలకృష్ణ, దేశవత్ శ్రీహరి, సీనియర్ నాయకులు కారు నర్సన్న, కంది రవి, మట్టెల రత్నాకర్, గొగ్గెల రాజేష్, శ్యామ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.