16-10-2025 05:49:56 PM
ఎస్పీ కాంతిలాల్ పాటిల్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): శాంతి భద్రతలపై దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. కౌటాల సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని గురువారం తనిఖీ చేశారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం డీఎస్పీ వాహిదుద్దీన్‌తో కలిసి మొక్కలు నాటారు. తనిఖీ సందర్భంగా కార్యాలయ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను సమీక్షించారు. మర్డర్, డౌరీ డెత్ కేసులపై నాణ్యమైన దర్యాప్తు జరగాలని, సీసీ కెమెరాల ఏర్పాటు పెంపొందించాలని సూచించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని, మాదకద్రవ్యాల నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ దర్యాప్తు తీరు, రికార్డుల నిర్వహణను ప్రశంసించారు.