16-10-2025 05:45:49 PM
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోషణ మాసం కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. పోషణ మాసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ ఇవాంజెలినా హాజరయ్యారు. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. 1000 రోజుల పోషకాహారాల ప్రణాళికను ప్రాధాన్యతను వివరించారు. తగిన పోషకాలు గర్భిణీల ఆరోగ్యానికి దోహ పడతాయిన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సిడిపిఓ స్వరూపరాణి, సూపర్వైజర్స్,పోషణ అభియాన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రజిత, డి పి ఏ శ్యామల ,ఉమెన్ హబ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.