27-11-2025 12:00:00 AM
మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మొండి చెయ్యనా .. !
మండలంలో పంచాయతీలకు ప్రకటిం చిన రిజర్వేషన్లతో బీసీ వర్గాలు మండిపా టు. మండలంలో బీసీలకు పంచాయతీ లలో గతంలో కంటే తక్కువ స్థానాల కేటాయింపు. బీసీ వర్గాలపై సముచితమైన గౌరవ స్థానా న్ని కల్పించాలని సమాజం లో వారికి మరిన్ని పదవులు కల్పించాలని తద్వారా భవిష్యత్తులో బీసీ వర్గాల రాజ్యమేలేందు కు ప్రతిష్టాత్మకంగా ప్రజా ప్రభుత్వం 42 శాతం బీసీ వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యాలను తీసుకొచ్చేందుకు శాసనసభ లో చట్టబద్ధతను కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు చట్టబద్ధతను కల్పించాలని ప్రజా ప్రభుత్వం భావించిం ది. ప్రజా ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
రిజర్వేషన్లపై రాష్ట్రమంతటా బీసీ వర్గాలు సంబరాలు చేసుకున్నారు. దీనిపై హైకోర్టు లో పెండింగ్లో ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికలలో పాత రిజర్వేష న్ ప్రకారమే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను కల్పించారు. దీంతో మండలంలో బీసీలకు గతంలో ఏడు స్థానాలను గ్రామపంచాయతీలో
కేటాయించగా ఈసారి జరిగే ఎన్నికలలో ఐదు గ్రామపంచాయతీలకే బీసీ వర్గాలకు కేటాయించారు. దీనితో అధికారపక్షం బీసీ వర్గాలకు అన్యాయం చేసిందని మండల బీసీ వర్గాలు మండిపడుతున్నాయి.
ఎర్రుపాలెం నవంబర్ 26 (విజయక్రాంతి) :ప్రజా ప్రభుత్వం బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఈ స్థానిక ఎన్నికల నుంచే అమలు చేస్తామని దీనిపై చట్టబద్ధత కల్పిస్తామని బీసీ వర్గాలకు సమాజంలో సముచిత స్థానాన్ని కల్పించి వారిని గౌరవించే విధంగా భవిష్యత్తులో బీసీలు రాజ్యమేలాలని సంకల్పించి చట్టబద్ధతను కల్పించేందుకు బీసీ బిల్లును ప్రవేశపెట్టింది.
అయితే ఈ బిల్లుపై బీసీ వర్గాలు సంబరాలు చేసుకున్నారు. దీనిపై హైకోర్టులో పెండింగ్లో ఉండడంతో రాష్ట్రమంతటా స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసినట్లు అయింది. ఎర్రుపాలెం మండలంలో గతంలో బీసీ వర్గాలకు స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికలలో ఏడు స్థానాలను కేటాయించగా ఈసారి జరిగే ఎన్నికల లో గ్రామపంచాయతీలకు ఐదు స్థానాలనే కేటాయించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పటినుంచో సర్పంచి పదవులకు పోటీ చేయాలని ఆశతో ఆశావాహులు నిరీక్షిస్తున్నారు. పదవులను నమ్ముకున్న బీసీ వర్గాల నాయకులు ఇప్పుడు ప్రకటించిన రిజర్వేష న్లు అమలుతో తమ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిందని, ఎలా ముందుకు పోవాలో తెలియడం లేదని వాపోతున్నారు. గత అభివృద్ధి పనులలో గ్రామాలను అంటిపెట్టుకొని తమకే ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అధిష్టానం కల్పిస్తుందని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
అయితే మండలంలో బీసీల ప్రకటించిన ఐదు గ్రామాలే ఉండడంతో పదవులను నమ్ముకున్న వారి ఆశలు అడియాశలు అయ్యాయి. మండలంలో గతంలో బీసీలకు ఏడు స్థానాలను కేటాయించగా, ఈసారి జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఐదు స్థానాలే కేటాయించడం జరిగింది. దీనితో తమ భవిష్యత్తు ఏంటని వారికి వారే ప్రశ్నించుకుంటూ దిగులు చెం దుతున్నారు. మండలంలో వచ్చిన ఐదు గ్రా మపంచాయతీ స్థానాలకు అధిష్టానం టికెట్ ఎవరికి స్తుందో అదృష్టం ఎవరిని వరిస్తుందో అని చర్చించుకుంటున్నారు.
గతంలో బీసీలకు ప్రకటించిన ఏడు స్థానాలు ఎర్రుపా లెం, కాచవరం,తెల్ల పాలెం, కొత్తపాలెం, నరసింహ పురం, గట్ల గౌరవరం ,రామాపురం, కాగా ప్రస్తుతం స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో బీసీలకు ఐదు స్థానాలను కేటా యించారు. అందులో రాజుల దేవరపాడు, ములుగుమాడు, అయ్యవారిగూడెం, మా మునూరు, భీమవరం. మాత్రమే ఉన్నాయి . అయితే రిజర్వేషన్ల లలో అవకతవకలు జరిగాయని బీసీలకు గతంలో మాదిరిగానే రిజర్వేషన్లు రావాలని మండల ప్రజలు కోరుతున్నారు.