calender_icon.png 24 October, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని రంగాల్లో బీసీలకు 50% వాటా దక్కాలి

24-10-2025 12:10:32 AM

అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని బీసీ జేఏసీ ఏర్పాటు చేయాలిల

మహాజన సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీగల ప్రదీప్‌గౌడ్

ఖైరతాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి) : బీసీల కు కేవలం స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కాకుండా అన్ని రంగాల్లో 50శాతానికి పైగా వాటా దక్కాలని అందుకు తమిళనాడు తరహా బీసీ ఉద్యమాన్ని నిర్మించి బీసీ ముఖ్యమంత్రి అయ్యే వరకు పోరాడుతామని మహాజన సేన పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు తీగల ప్రదీప్ గౌడ్ అన్నారు.

గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అన్ని రంగాల్లో బీసీలకు 50% రిజర్వేషన్ల సాధనే లక్ష్యం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైం దని కావాలనే స్టే వచ్చే విదంగా కుట్రలు చేశారన్నారు. అఖిల పక్షా న్ని ఢిల్లీ కి తీసుకెళ్లి బీసీల ఆకాంక్షను చాటే ప్రయత్నం బీసీ ఎంపీలు, కేంద్ర మంత్రులు చేయరా అని ప్రశ్నించారు. 

పార్టీలకు కొమ్ముకాసే వారు జాక్‌ని నడిపిస్తారా?

ఈ నెల 18న బీసీ బంద్ విజయవంతమయ్యిందని, కానీ నాయకులే విఫల మయ్యార ని ప్రదీప్‌గౌడ్ విమర్శించారు. ఆర్. కృష్ణయ్య, బీసీ జాక్ ఛైర్మెన్‌గా అనర్హుడని, త్యాగాన్ని గుర్తించి వివిధ అగ్రకుల పార్టీలు పదవులు కట్టబెట్టారని రాజకీయ పార్టీకి కొమ్ముకాసే వాళ్ళు జాక్‌ని నడిపిస్తారా అని ప్రశ్నించారు.