24-10-2025 12:11:11 AM
కలెక్టర్ హైమావతి
చేర్యాల, అక్టోబర్ 23: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాం లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హైమావతి పరిశీలించారు. సెంటర్లో పాడి క్లీనర్ తేమ శాతం, కొలత యంత్రాలు, కాంటలు, టార్పలిన్ కవర్లు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు.
గత పది రోజులుగా సెంటర్లో ఆరబోయగ తేమశాతం వచ్చిన కూడా కొనుగోలు చేయట్లేదని రైతులు కలెక్టర్ ద్రుష్టికి తీసుకురాగా తేమశాతం వచ్చిందని వడ్లు క్లీనింగ్ చేయించి వెంటనే గన్నిలలో నింపి లోడ్ చేయించాలని సిబ్బందికి, తహసిల్దార్ ను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చెయ్యాలని విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.
మండలంలో వరిధాన్య కొనుగోలు కేంద్రాలు పర్యవేక్షణ చెయ్యాలని తహసిల్దార్ కు చెప్పారు. అనంతరం ప్రాంగణం లోని మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. తేమశాతం గమనించారు. తేమ శాతం తగ్గిన మొక్కజొన్నలను క్లీనింగ్ చేసి వెంటనే లోడ్ చెయ్యాలని తెలిపారు. కలెక్టర్ వెంట చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్, ఆర్‌ఐ రాజేందర్ రెడ్డిలు ఉన్నారు.