06-11-2025 07:51:04 PM
-బెల్లంపల్లి ఎసిపి రవికుమార్
మందమర్రి (విజయక్రాంతి): డిజిటల్ యుగంలోవిద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన పెంచు కావడంతో పాటు ప్రజలను వాటి బారిన పడకుండా చైతన్య వంతులను చేయాలని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ కోరారు. సైబర్ జాగరూకత దివాస్ లో బాగంగా గురువారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రస్తుత సాంకేతిక యుగంలో యువతరం ఇంటర్నెట్ వాడకంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంద న్నారు. సైబర్ నేరగాళ్లు అమాయకులను ఎలా లక్ష్యం చేసుకొని మోసగిస్తున్నారో ఉదాహరణలతో సహా వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అవగాహన పొందిన విషయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో పంచుకోవాలని తద్వారా అందరికీ అవగాహన కలుగు తుందన్నారు. ముఖ్యంగా పార్ట్-టైమ్ జాబ్, డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్, పెట్టుబడి మోసాలు, కస్టమర్ కేర్ సంబంధిత మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితుల నుండి వచ్చే లింకులు, కాల్స్, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని ఎట్టి పరిస్థితు ల్లోనూ పంచుకోకూడదని సూచించారు. ఈ కార్యక్రమం లో సిఐ కేశశిధర్ రెడ్డి ఎస్సై ఎస్ రాజశేఖర్, ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, అధ్యాపకులు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.